Homeజాతీయంయూపీ సీఎం యోగి మాస్‌ కౌంటర్‌.. భారత్‌ ధర్మశాల కాదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు....!

యూపీ సీఎం యోగి మాస్‌ కౌంటర్‌.. భారత్‌ ధర్మశాల కాదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు….!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌ : యూపీ సీఎం యోగి ఆధిత్య నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ సంస్కృతి పట్ల విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్న వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లక్నోలో మంగళవారం నిర్వహించిన శ్రీరామ కథా మహోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల విశ్వాసం లేని వారికి భారత్‌ ఎంతమాత్రం ధర్మశాల కాదంటూ స్పష్టం చేశారు. లవ్‌ జీహాద్‌.. ల్యాండ్‌ జీహాద్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శ్రీరాముని ఆదర్శాలను యావద్ధేశాన్ని ఏకం చేస్తున్నాయన్న ఆయన.. రామయణ కాలానికి, నవీన భారతానికి మధ్య సారూప్యాన్ని వివరించారు. భారత్‌ ఎంత మాత్రం ధర్మశాల కాదని చెప్పిన యోగి.. దేశ సంస్కృతి, వారసత్వం, విలువలను గౌరవించే వాళ్లు మాత్రమే ఇక్కడ గౌరవంగా జీవించవచ్చన్నారు. భారతదేశ స్ఫూర్తి, సాంప్రదాయాలను అంగీకరించని వాళ్లకు ఇక్కడ స్థానం లేదంటూ స్పష్టం చేశారు. దుష్ట శక్తులు అధికారంలో ఉన్నప్పుడల్లా రాక్షసరాజు రావణాసురుడి కాలంలో ఏ విధంగా దుష్ట శిక్షణ జరిగిందో అదే పునరావృతమవుతుందన్నారు.

లవ్‌ జీహాద్‌పై సంచలన వ్యాఖ్యలు…

ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆధిత్య నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని జనాభా మార్పు కోసం జరుగుతున్న కుట్రలో భాగమే లవ్‌ జీహాద్‌ అంటూ వ్యాఖ్యానించారు. రామాయణ కాలంలో కూడా ఖాళీగా ఉన్న భూములను మారీచుడు, ఖరదూషణాది రాక్షసులు దురాక్రమణ చేసేవారన్న ఆయన.. ల్యాండ్‌ జీహాద్‌కు పాల్పడే వారిని పేర్కొన్నారు. ప్రతి యుగంలోనూ దుష్ట శక్తులు ఉంటాయని చెప్పిన యోగి.. సత్యం, మతం పరిరక్షణకు శ్రీరాము ఎలా పాటుపడ్డాడో అందరూ తెలుసుకుని కార్యబద్ధులు కావాలంటూ సూచించారు. ఐక్యంగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు