
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రేపు జరగబోయేటువంటి టి20 గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరగబోయేటువంటి మొదటి టీ20 మ్యాచ్ లో ఇండియా గెలుస్తుంది అని భావించారు. ఇక టి20 కెప్టెన్ గా సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని.. అతను జట్టును బాగా నడిపిస్తున్నారు అని అన్నారు. సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ పై నాకు ఎలాంటి ఆందోళన లేదు అని కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు. మేము అగ్రెసివ్ మరియు ఫియర్ లెస్ గేమ్ ఆడాలనేదే అనుకుంటామని అన్నారు. అలా ఆట మొదలు పెట్టినప్పుడు త్వరగా అవుట్ అవ్వడం అలాగే కొన్ని మిస్టేక్స్ జరగడం అనేది సహజమని అన్నారు. ఒక 30 బంతుల్లో 45 లేదా 50 పరుగులు చేయడం వల్ల విమర్శకులకు దూరంగా ఉండొచ్చు కానీ మేము ఎప్పుడూ అలా అనుకోము అని.. T20 అంటేనే కొంచెం స్పీడుగా ఆడాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. టి20 లకు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హెడ్ కోచ్ గంభీర్. ఒక కెప్టెన్ గా జట్టును సూర్య కుమార్ యాదవ్ చాలా చక్కగా ముందుకు సాగించగలరు అని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో గంభీర్ వ్యాఖ్యలు చేశారు. కాగా వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు టి20 సిరీస్ పై కన్ను వేసింది. ఎలాగైనా సరే ఆస్ట్రేలియా పై టీ20 సిరీస్ నెగ్గి ఎదురుదెబ్బ కొట్టాలని చూస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కైవసం చేసుకున్నట్లుగానే టీ20 సిరీస్ కూడా గెలవాలన్న కసితో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. మరి రేపు జరగబోయేటువంటి మొదటి T20 మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ చేయండి.
Read also : తెలంగాణలో దంచి కొట్టనున్న వర్షాలు.. జరభద్రం!
Read also : నేడే తుఫాన్ ఎఫెక్ట్.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకండి!





