
క్రైమ్ మిర్రర్, తిరుపతి:- తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటువంటి లడ్డులో కల్తీ నెయ్యి వాడారు అని అప్పట్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఆరోపించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ విషయంపై ఎంక్వయిరీలు చేయగా అన్ని వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ EO ధర్మారెడ్డి అప్రూవర్ గా మారినట్లు సమాచారం. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్ని కూడా జరిగినట్లుగా ధర్మారెడ్డి అంగీకరించారని సమాచారం . తాజాగా CBI సిట్ కు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారాన్ని బయటపెట్టినట్లు తెలుస్తుంది. కాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చేటువంటి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని స్పష్టమైంది. దాదాపు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరగగా దాని విలువ దాదాపు 245 కోట్లకు పైగానే ఉంటుందని టీడీపీ పార్టీ తెలిపింది. మరి ఇందులో జగన్ వాటా ఎంత?.. అలాగే వైవీ సుబ్బారెడ్డి వాటా ఎంత?.. అని కూడా సోషల్ మీడియా వేదికగా టిడిపి ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది.
Read also : బీహార్ లో నాదే గెలుపు.. ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పే : తేజస్వి యాదవ్
Read also : RCB అభిమానులకు షాకింగ్ న్యూస్.. స్టేడియం చేంజ్?





