Homeక్రైమ్బాలీవుడ్ ప్రముఖ హీరోకు బెదిరింపులు..?

బాలీవుడ్ ప్రముఖ హీరోకు బెదిరింపులు..?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్ కు తాజాగా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. కొన్ని కోట్ల రూపాయల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ అతనికి కొంతమంది దుండగులు వాయిస్ మెసేజ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళగా అప్రమత్తమైన ముంబై పోలీసులు నటుడు రన్వీర్ సింగ్ ఇంటి వద్ద భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. వెంటనే వాయిస్ మెసేజ్ పంపించినటువంటి దుండగులను కనుగొనే విధంగా పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే రణవీర్ సింగ్ ఈ విషయంపై అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినప్పటికీ కూడా దర్యాప్తు చేస్తున్నారన్నట్లుగా సమాచారం వైరల్ అవుతుంది. కాగా కొద్ది రోజుల క్రితమే రన్వీర్ సింగ్ హీరోగా నటించినటువంటి “దురందర్” సినిమా ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ వాయిస్ మెసేజ్ పెట్టినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు మరిన్ని వివరాలు తెలియజేయాల్సి ఉంది.

అర్జున్ టెండూల్కర్ పెళ్లి.. కుటుంబ సమేతంగా మోదీకి సచిన్ ఆహ్వానం

ITI Student: ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఊహించని పని చేసిన బాలుడు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments