
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- మన ప్రపంచంలో ఎంతోమంది బిలినియర్లు ఉన్నారు. ఎలన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, బిల్ గేట్స్, అంబానీ, అదాని వంటి మనకు తెలిసిన ఎంతోమంది బిలీనియర్లు ఈ ప్రపంచంలో ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది బిలీనియర్లు ఉండే నగరాలు ఇప్పటివరకు చాలామందికి తెలియకపోవచ్చు. దాదాపు 119 మంది కుబేర్లు ఒకే నగరంలో ఉన్నారంటే మీరు నమ్ముతారా?.. అవును ఇది నిజమే. మరి ఈరోజు మన క్రైమ్స్పె మిర్రర్ స్పెషల్ న్యూస్ లో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బిలీనియర్లు ఉన్నటువంటి టాప్ 10 నగరాలు ఏవో మనం తెలుసుకుందాం.
ఎక్కువమంది బిలీనియర్లు ఉన్న టాప్ 10 నగరాలు
1. న్యూయార్క్ – 119 మంది
2. లండన్ -97 మంది
3. ముంబై -92 మంది
4. బీజింగ్ -91 మంది
5. షాంగై -87 మంది
6. సెంజిన్ -84 మంది
7. హాంకాంగ్ -65 మంది
8. మాస్కో -59 మంది
9. ఢిల్లీ -57 మంది
10. శాన్ ఫ్రాన్స్ కో -52 మంది
పైన పేర్కొన్న మొదటి పది స్థానాల జాబితాలో మన భారతదేశం నుంచి ముంబై మరియు ఢిల్లీ వంటి ముఖ్య నగరాల్లో కలిపి మొత్తం 149 మంది కుబేరులు ఉన్నారు. ముంబై, ఢిల్లీ నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది బిలినియర్ల టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. దీన్నిబట్టి మన భారతదేశంలో కూడా ఎంతోమంది బిలీనియర్లు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
Read also : బ్రేకింగ్ న్యూస్.. డిశ్చార్జ్ అయిన నటుడు ధర్మేంద్ర!
Read also : తెలంగాణపై చలి పంజా…వృద్ధులు, పిల్లలు జాగ్రత్త





