
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా నుంచి తాజాగా ” చికిరి చికిరి ” అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. అయితే విడుదల చేసిన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్ గా రికార్డులు సృష్టించింది. గడిచిన 14 గంటల్లోనే ఏకంగా 28 మిలియన్ల వ్యూస్ సాధించి పుష్ప సినిమాలోని కిసిక్ సాంగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. పుష్ప 2 సినిమాలోని కిసిక్ అనే సాంగ్ గడిచిన 24 గంటల్లో 27.19 మిలియన్ల వ్యూస్ సాధించి.. చరిత్ర సృష్టిస్తే తాజాగా పెద్ది సినిమాలోని చికిరి చికిరి అనే వీడియో సాంగ్ ఆ చరిత్రనే అధిగమించింది. పుష్ప సినిమా రికార్డులను బ్రేక్ చేసి పెద్ది సినిమా మరో రికార్డును సృష్టించింది. ఈ వీడియో సాంగ్ లోని రామ్ చరణ్ వేసినటువంటి స్టెప్స్ సోషల్ మీడియా అంతట కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులతో పాటు మెగా అభిమానులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర విఫలమైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఇప్పుడు నటిస్తున్నటువంటి పెద్ది సినిమా రామ్ చరణ్ కెరీర్ లో నే అది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. 2026 మార్చి 27వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది అని తెలిపారు.
Read also : తెలంగాణలో వింత ఘటన.. పొలాల్లోకి దూసుకు వచ్చిన వందల కోళ్ళు.. ఎగబడ్డ జనం?
Read also : ఆ వార్తలన్ని నిజమే.. నన్ను క్షమించండి.. రష్మిక సంచలన వ్యాఖ్యలు!





