క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ టి20 లో సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. పది సిక్స్ లు, ఐదు ఫోర్ లతో ముంబైలోని ప్రేక్షకులను అలరించాడు. ముంబై వేదికగా జరుగుతున్న ఈ ఐదవ టి20 లో కేవలం పదోవర్లలోని 150 స్కోరు నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 250 కు పైగా స్కోర్ చేయగల అవకాశం ఉంది. ప్రస్తుతం సెంచరీ చేసిన అభిషేక్ శర్మ ఇంకా గ్రీస్లోనే ఉన్నాడు. అభిషేక్ శర్మ గ్రీస్లో ఇంకొంచెం సేపు ఉంటే కచ్చితంగా 150 లేదా డబల్ సెంచరీ చేసే అవకాశం ఉంది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా పవర్ ప్లే లో 75 పరుగులను చేసింది. సంజు సాంసంగ్ మరియు తిలక్ వర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ తక్కువ పురుగులతో ఈ మ్యాచ్ లో నిరాశపరిచారు.
ఢిల్లీలో ప్రచారాలు చేయనున్న తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు?
అన్నపూర్ణగా ఉండాల్సిన రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చేశారు?