
గుట్టుప్పల, క్రైమ్ మిర్రర్:- గట్టుప్పల గ్రామ సర్పంచి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నాటి శ్రీనివాస్ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. గతంలో సర్పంచ్ స్థానాన్ని ఆశించి కొన్ని సమీకరణలతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈసారి పోటీలో ఉంటారని ప్రముఖంగా ఆయన పేరు అయితే గట్టిగానే వినబడుతుంది. ఈయన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ పరంగా కావచ్చు.. ప్రజల నుంచి కావచ్చు ఈయనకు ఎలాంటి మైనస్ లు లేవని తెలుస్తుంది. క్యాస్ట్ అండ్ క్యాష్ ఈక్వేషన్ చూసిన ఈయనకు అన్ని రకాలుగా అవకాశం ఉంది. ఈ విషయమై ఆయనతో మాట్లాడగా సర్పంచ్ గా పోటీ చేయాలనే ఆలోచన ఉందని అయితే మాజీ సర్పంచ్ నామని జగన్నాథం మరియు పార్టీ క్యాడర్ నిర్ణయంతో పాటు ప్రజాభిప్రాయం మేరకు తాను ముందుకు వెళ్తానని తెలిపారు.
Read also : ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ ప్రజలు!
Read also : సౌత్ ఆఫ్రికా తో భారత్ ఢీ.. కెప్టెన్, జట్టు పూర్తి వివరాలు ఇవే!





