Homeక్రైమ్క‌ల్తీ మామిడిపండ్ల‌పై త‌స్మాస్ జాగ్ర‌త్త‌...సీపీ స‌జ్జ‌నార్‌...!

క‌ల్తీ మామిడిపండ్ల‌పై త‌స్మాస్ జాగ్ర‌త్త‌…సీపీ స‌జ్జ‌నార్‌…!

హైద‌రాబ‌బాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: మార్క‌ట్ లో ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వ‌స్తున్నాయ‌ని, ఎక్కువ లాభాల కోసం వ్యాపారులు కాల్షియం కార్బైడ్, ఎథెపాన్ వంటి ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు వాడుతున్నార‌ని అలాంటివి క‌నిపిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ఆహార భ‌ద్ర‌త అధికారులు, సీపీ స‌జ్జ‌నార్ తెలిపారు. ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు వాడి పండ్ల‌ను మాగ‌పెడుతున్నార‌ని వీటిని తింటే ప్ర‌జ‌లు అనారోగ్య‌భారిన‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.

దీనిపి సైబ‌రాబాద్్ క‌మిష‌న‌ర్‌, ఆహార భ‌ద్ర‌త సిబ్బంది గ‌ట్టి నిఘా పెట్టాయ‌ని తెలిపారు. కార్బైడ్ పండ్ల వల్ల కలిగే ఆరోగ్య నష్టాలుకార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల తక్షణమే కాకుండా, దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి,వికారం, వాంతులు, కడుపునొప్పి మరియు విరోచనాలు.శ్వాసకోశ ఇబ్బందులు, నోటి పూత, గొంతులో మంట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నాడీ వ్యవస్థపై ప్రభావం, తలనొప్పి, కళ్ళు తిరగడం, నిద్రలేమి.క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉద‌ని తెలిపారు.

కల్తీ మామిడి పండ్లను గుర్తించడం ఎలా….?

మీరు కొనే పండ్లు సహజంగా పండినవా లేదా రసాయనాలతో పండినవా అనేది ఈ క్రింది గుర్తుల ద్వారా తెలుసుకోవచ్చు. స‌హ‌జంగా పండిన పండురసాయనాలతో పండిన పండురంగు పండు అంతటా ఒకేలా కాకుండా అక్కడక్కడా పసుపు, ఆకుపచ్చగా ఉంటుంది.పండు మొత్తం ఏకరీతిగా ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది.వాసనపండు దగ్గరకు వెళ్తే మంచి సువాసన వస్తుంది.అస్సలు వాసన రాదు లేదా రసాయన వాసన వస్తుంది.రుచితియ్యగా, నోటికి రుచిగా ఉంటుంది.లోపల పుల్లగా ఉండవచ్చు లేదా రుచి చప్పగా ఉంటుంది.ఆకృతిపండుపై నొక్కితే మృదువుగా ఉంటుంది.పైన పసుపుగా ఉన్నా, లోపల గట్టిగా ఉంటుంది.నీటి పరీక్షనీటిలో వేస్తే మునుగుతుంది.నీటిలో వేస్తే తేలుతుంద‌ని తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

మార్కెట్ నుండి తెచ్చిన పండ్లను కనీసం 15-20 నిమిషాల పాటు నీటిలో ఉంచి, ఆ తర్వాత బాగా కడిగి వాడాలి. ఉప్పు నీటిలో కడగడం ఇంకా మంచిది.తొక్క తీసి తినాలి: పండు తొక్కపై రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తొక్కను పూర్తిగా తొలగించి తినండి.నమ్మకమైన చోట కొనండి: వీలైనంత వరకు నేరుగా రైతుల వద్ద లేదా ఆర్గానిక్ స్టోర్స్ నుండి కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడైనా కృత్రిమంగా పండిస్తున్నట్లు గుర్తిస్తే లేదా నకిలీ పండ్లను విక్రయిస్తున్నట్లు తెలిస్తే, వెంటనే స్థానిక ఆహార భద్రతా అధికారులకు లేదా పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments