తెలంగాణ

ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్‌, బండి సంజయ్‌

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల పర్యటన

  • గంభీరావుపేటలో ఎదురుపడ్డ కేటీఆర్‌, సంజయ్‌

  • వరద పరిస్థితిని కేంద్రమంత్రి సంజయ్‌కి వివరించిన కేటీఆర్‌

క్రైమ్‌మిర్రర్‌, నిఘా: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లోని వందలాది గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్లలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్రమంత్రి బండి సంజయ్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేర్వేరుగా పర్యటించారు.

గంభీరావుపేట మండలంలో ఇరువురు నేతలు అకస్మాత్తుగా ఎదురుపడ్డారు. ఇద్దరు నాయకులు ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీంతో అక్కడున్నవారంతా కేరింతలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిపై కేంద్రమంత్రి బండి సంజయ్‌కి కేటీఆర్‌ వివరించారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితిపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని సంజయ్‌ తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Read Also: 

  1. వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
  2. పత్త లేని కుర్తి పంచాయతీ సెక్రెటరీ విజయ
Back to top button