తెలంగాణ
Trending

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది!… 100% అధికారంలోకి నేనే వస్తా : KCR

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముందడుగు వేయించడంలో పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఆరోపించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నాశనం అయిపోయిందని దుయ్యబట్టారు. కేవలం తమ టిఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాడగలదని అన్నారు. కాబట్టి ఇప్పటినుండి పార్టీ నేతలు అందరూ కూడా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలు కేవలం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు మాత్రమే తెలుసు అని కెసిఆర్ అన్నారు. 100% తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మేము అధికారంలోకి వస్తామని తెలంగాణ భవన్లో జరిగిన విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ భావం వ్యక్తం చేస్తూ తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కెసిఆర్ చాలా అనారోగ్యాలకు గురై కేవలం ఇంటికే పరిమితమయ్యారు. కానీ ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకొని పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. నడవలేని స్థాయి నుంచి ఇవాళ కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చేలా భరోసా కల్పిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మా నాయకుడు కదిలారు… మళ్లీ ప్రజల గుండెల్లో నిలుస్తారు… రాబోయేది మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమే అని పార్టీ నాయకులు కార్యకర్తల గుండెల్లో జోష్ నింపుతున్నారు.

ఇవి కూడా చదవండి

  1. ఫ్యాన్స్ లేక స్టేడియం విలవిల!… మొదటి రోజే పాకిస్తాన్ పై ట్రోలింగ్?
  2.  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!… మార్చి 28న సినిమా రిలీజ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button