
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నేడు వర్షాలు దంచికొట్టునున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలలో బీభత్సమైన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయపరంగానూ, ఆస్తి పరంగాను ఎంతోమంది నష్టపోగా.. మళ్లీ నేడు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో మళ్ళీ ప్రజలు భయపడుతున్నారు. మొంథా తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో అని ఎదురుచూస్తున్నారు.
 ఏపీలో వర్షాలు పడే జిల్లాలు :-
1. తూర్పుగోదావరి
2. కోనసీమ
3. పశ్చిమగోదావరి
4. కృష్ణ
5. బాపట్ల
6. పల్నాడు
7. నెల్లూరు
8. అనంతపురం
9. చిత్తూరు
10. తిరుపతి 
ఏపీలో పైన పేర్కొన్న ఈ 10 జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
 తెలంగాణలో వర్షాలు పడే జిల్లాలు
1. అదిలాబాద్
2. నిర్మల్
3. నిజామాబాద్
4. జనగామ
5. సిద్దిపేట
6. యాదాద్రి
7. హైదరాబాద్
8. మేడ్చల్
9. సంగారెడ్డి
10. రంగారెడ్డి
11. మెదక్
12. కామారెడ్డి
13. నారాయణపేట
14. మహబూబ్ నగర్
15. వనపర్తి
16. జోగులాంబ గద్వాల్ 
తెలంగాణ రాష్ట్రంలోని ఈ 16 జిల్లాలలో నేడు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కావున ఈరోజు కూడా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులపాటు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
Read also : పరీక్షలు బహిష్కరణ.. నిధులన్నీ ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్
Read also : కన్యక పరమేశ్వరి ఆలయంలో కనుల పండగ.. లక్ష దీపోత్సవం!
				
					
						




