
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఒక వైపు భారత్, మరో వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్ ఆగమాగమవుతోంది. బలూచిస్తాన్ మరికొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ నుంచి విడిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బయటకు వెళ్తే, ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ లేదు. పాక్ ఆర్మీ వాహనం పై రిమోట్ కంట్రోల్ తో…IED బాంబు ను పేల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పెషల్ ప్రాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్. ఈ దాడిలో ఏకంగా 14 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ముచ్ కుంద్ ప్రాంతంలో…ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్ పాకిస్తాన్ చేజారి పోతోందన్నారు. ఇప్పటికే, చాలా ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వ నియంత్రణ లేదని, అది పాకిస్తాన్ నియంత్రణ నుంచి జారిపోయిందని తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారులు సెక్యూరిటీ ఎస్కార్ట్ లేకుండా బలూచిస్తాన్ ప్రావిన్సులో తిరగలేరన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీ.
మరోవైపు పాకిస్తాన్ లోని ఉగ్ర మూకలు ఉన్న తొమ్మిది స్థావరాలపై భారత్ అటాక్ చేసింది. ఈ దెబ్బకు వందకు పైగా ఉగ్రవాదులు మరణించారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణకాండకు ప్రతీకార చర్యగా…ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది భారత్ ఆర్మీ. ఇక తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎటాక్‌తో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.