ఆంధ్ర ప్రదేశ్తెలంగాణసినిమా

శివ శంభో చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈటెల రాజేందర్

అనంత ఆర్ట్స్ పతాకంపై బొజ్జ రాజగోపాల్, సుగుణ దోరవేటి నిర్మించిన సంగీత సాహిత్య విలువలు కలిగిన భక్తి ప్రధానమైన చిత్రం శివ శంభో ఏప్రిల్ 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు గౌరవ పార్లమెంటు సభ్యులు  ఈటెల రాజేందర్ ప్రకటించారు. నర్సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ కళలైన సంగీతం సాహిత్యం నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన సందేశాత్మక చిత్రమని ఇటువంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : జగ్గారెడ్డి ఏ వార్‌ లవ్‌ – టీజర్‌ అదిరిందిగా..! 

ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రజలకు అన్నిరకాల శుభాలను ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకులు దోరవేటి మాట్లాడుతూ ఉత్తమాభిరుచి గల ప్రేక్షకులు తప్పకుండా తమ చిత్రాన్ని ఆదరిస్తారన్న విశ్వాసం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బొజ్జ రాజగోపాల్, నటులు రమేశ్, బేబీ రిషిత, మేనేజర్ చిట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button