జాతీయం

జాన్‌పూర్‌లో వింత పెళ్లి.. మరుసటి రోజే వరుడు మృతి!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్:- ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లాలో ఇప్పుడు ఒక వింత పెళ్లి, అనూహ్య మరణం కేసుతో హాట్ టాపిక్‌గా నిలిచింది. 75 ఏళ్ల సంగ్రురామ్ రెండో పెళ్లి చేసుకున్న మరుసటి రోజే మృతి చెందడం ఊహించని మలుపుగా మారింది. గత ఏడాది భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న సంగ్రు, బంధువుల సలహాతోనే మంభావతి అనే 35 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సంతోషం నిలవకముందే ఉదయం వరుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం అనుమానాస్పద వాతావరణాన్ని సృష్టించింది.పెళ్లి రాత్రి తనతోనే కూర్చున్న మంభావతికి సంగ్రు “ఇంటి బాధ్యతలు నువ్వే చూసుకోవాలి” అని చెప్పినట్టు సమాచారం. మరుసటి ఉదయం అతను హఠాత్తుగా మరణించడంతో ఆమె కన్నీళ్లలో మునిగిపోయింది. కానీ ఈ కథ ఇంతలోనే ముగియలేదని స్థానికులు గుసగుసలాడుతున్నారు. 75 ఏళ్ల వృద్ధుడు అకస్మాత్తుగా చనిపోవడం సహజమేనా? లేక ఇందులో దాగి ఉన్న వేరే కోణమేదైనా ఉందా? ఇంట్లోకి వచ్చిన కొత్త వధువు పైనే ఇప్పుడు అందరి చూపు నిలిచింది. పెళ్లి వెంటనే వరుడు చనిపోవడం ఆస్తి ప్రయోజనాల కోసం వేసిన ముఠా ప్లాన్ కావచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మరణానికి ముందు సంగ్రు తిన్న ఆహారం గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. నిజంగా హార్ట్‌అటాక్ వచ్చిందా? లేక ఆహారంలో ఏదైనా మిక్స్ చేసి ప్రాణాలు తీయబడ్డాయా? అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది.మంభావతి మాత్రం తనకు ఈ పెళ్లి కొత్త జీవితం అనుకుంటే ఇలాగే దురదృష్టం వెంటాడిందని చెబుతోంది. కానీ బంధువులు మాత్రం ఈ సంఘటనలో ఏదో అనుమానాస్పద కోణం ఉందని నొక్కి చెబుతున్నారు. ఇప్పటికీ ఆస్తుల హక్కులు ఎవరి పేరుపై ఉంటాయనే దానిపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ రాకముందు వరకూ ఈ కేసు మిస్టరీగా మిగిలిపోనుంది. సహజ మరణం వెనక దాగి ఉన్న వాస్తవం ఇంకేదైనా ఉందా? లేక వయసు భారమే సంగ్రురామ్ ప్రాణాలు తీసుకుందా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం జాన్‌పూర్ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Read also : యాదాద్రి కాంగ్రెస్ జడ్పీ చైర్మెన్ గా పాక మంజుల మల్లేష్ యాదవ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button