క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో దాఖలైన పరువునష్టం కేసులో ట్రయిల్ కోర్టు విచాచరణపై సుప్రీంకోర్టు సోమవారంనాడు స్టే విధించింది.
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు!.. ఎగిసి పడ్డ భారీ మంటలు?
రాహుల్ గాంధీ 2019లో జార్ఖాండ్‌లోని చైబాస నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అమిత్‌షా ”మర్డరర్”గా పేర్కొన్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్త నవీన్ ఝా ఈ పరువునష్టం కేసు వేశారు. రాహుల్ వ్యాఖ్యలు అమిత్‌షా గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. తొలుత ట్రయిల్ కోర్టులో దీనిపై విచారణ జరుగగా, దానిని కొట్టివేయాలని జార్ఖాండ్ హైకోర్టును రాహుల్ కోరారు. అయితే ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చడంతో దానిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును రాహుల్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన సుప్రీం ధర్మాసనం ట్రయిల్ కోర్ట్ విచారణపై స్టే విధించింది. రాహుల్ అప్పీల్‌పై సమాధానం తెలియజేయాలని జార్ఖాండ్ ప్రభుత్వానికి, నవీన్ ఝాకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు?..
రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. బాధిత వ్యక్తి మాత్రమే పరువునష్టం కేసు వేయాలని, ప్రాక్సీ పార్టీ ద్వారా ఫిర్యాదు చేయలేమని గతంలో న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.