-
గుడికి పూర్వవైభవం తీసుకొస్తా
-
ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పుతా
-
స్పందించిన 4వ వార్డుకౌన్సిలర్ యాదయ్య
యాదాద్రి, క్రైమ్ మిర్రర్: వందేళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం నేడు శిథిలావస్థకు చేరి కనీసం దీపారాదనకు నోచుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో వచ్చిన సందేశం ప్రతి ఒక్కరిని కదిలించింది… ఆలోచింప చేసింది.
వివరాల్లోకి వెళితే చౌటుప్పల్ మున్సిపాలిటి పరిధిలోని తంగడపల్లి గ్రామంలో పురాతన శ్రీ వెంకటేశ్వర ఆలయం ఎంతో మంది భక్తులతో కిటకిటలాడేది కాగా నేడు గుడి నిర్వహణ విస్మరించడంతో దీపారాదన చేయడం కూడ మానేశారు. కానీ ఇప్పుడు గుప్తా నిధులకోసం ఈ ఆలయంలో దుండగులు తవ్వకాలు నిర్వహించారు..
అయితే ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామస్తుల్లో ప్రధాన చర్చకు వచ్చింది. దీంతో చౌటుప్పల్ మున్సిపాలిటి 4వ వార్డు కౌన్సిలర్ ఉదరి యాదయ్య స్పందించి గుడి బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించారు.
ఆలయానికి పూర్వవైభవం తీసుకొస్తా…
శిథిలావస్థకు చేరిన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్దరించి పూర్వవైభవం తీసుకొస్తానని 4వ వార్డు కౌన్సిలర్ ఉదరి యాదయ్య అన్నారు. గుడిలో దీపారాధన, నైవేద్యాలతో మళ్లీ ఆధ్యాత్మిక వాతావరణం కలిగేలా గ్రామస్తులతో కలిసి పని చేస్తానన్నారు.
అదే విధంగా జాతర నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన ఊరి సంతోషం, ప్రజల కోసం నేను ఎప్పడు సేవ చేయడానికిసిద్దంగా ఉంటానని తెలిపారు. అదే విధంగా భక్తులు, గ్రామ పెద్దలు ఆలయ అభివృద్దికి ముందుకు రావాలని కోరారు.
త్వరలోనే ఆలయానికి అభివృద్ది పనులతో పాటు దీపారాదన పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు స్వాగతిస్తూ ఆలయం తిరిగి ఆధ్యాత్మిక శోభతో వెలుగొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
