జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262కోట్ల పరిహారం

 

అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి సియాటెల్‌ అటార్నీ జనరల్‌ 29 మిలియన్‌ డాలర్ల (రూ.262కోట్లు) పరిహారం చెల్లించేందుకు నిర్ణయించింది. ఈ ఒప్పందంతో జాహ్నవి కుటుంబానికి కొంతైనా ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నట్లు అటార్నీ జనరల్‌ తెలిపారు.

అమెరికాలోని సియాటెల్‌లో 2023లో ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా కారు నడిపి జాహ్నవి మృతికి కారణమయ్యారు. రోడ్డుదాటుతున్న జాహ్నవిని అతివేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. జాహ్నవి మృతిపై ఆ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు ఆయన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. పోలీసు అధికారి వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button