మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వివాదంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కష్టాల్లో పడింది. మంత్రి కామెంట్లు జాతీయ స్థాయిలో రచ్చగా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు. కొండా విషయంలో ఏం మాట్లాడాకో తెలియక కాంగ్రెస్ నేతలు పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు. అటు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ నేతలకు క్లాస్ పీకిందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో మందలించారని అంటున్నారు.
హైకమాండ్ క్లాస్ పీకడంతో సీఎం రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నారంటున్నారు. తాజా పరిణామాలతో పరువు పోవడంతో రేవంత్ టీం మరింత బరితెగిస్తోందని తెలుస్తోంది. రేవంత్ సైన్యం సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు పెడుతోంది. సినిమా ఇండస్ట్రీకి రేవంత్ సైన్యం డైరెక్ట్ వార్నింగ్ ఇస్తోంది. GHMC ఎన్నికలు అయిపోయిన తరువాత ఒక్కొక్కని సంగతి చెప్తాం అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు రేవంత్ సైన్యం టీం సభ్యులు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టాలీవుడ్ సంగతి తేలుస్తామంటూ బెదిరిస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగు సినిమా ప్రముఖుల నుండి వ్యతిరేకత రావడంతో ఖంగుతిన్న రేవంత్ టీం.. డైరెక్ట్ వార్నింగ్ లకి దిగుతున్నారని భావిస్తున్నారు.