Homeక్రైమ్బీహార్‌లో దారుణం.. ఏడాదిన్నర బాలుడిని హత్య చేసిన సొంత అన్న?

బీహార్‌లో దారుణం.. ఏడాదిన్నర బాలుడిని హత్య చేసిన సొంత అన్న?

క్రైమ్ మిర్రర్ : బీహార్‌లోని పాట్నా జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. జీతన్‌ ఛాప్రా గ్రామంలో ఏడాదిన్నర వయస్సున్న బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామంలోని దుర్గాదేవి ఆలయం సమీపంలో బాలుడి తల కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ ఘటనలో బాలుడి సొంత అన్న, 22 ఏళ్ల అజిత్‌ కుమార్‌ అలియాస్‌ బాలాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆడిస్తానని చెప్పి బాలా తన తమ్ముడిని ఇంటి సమీపంలోని దుర్గాదేవి ఆలయానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలుడు హత్యకు గురైనట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలో బాలుడి తలను వదిలి నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

అయితే, ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ కలహాలా, ఇతర కారణాలా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నిందితుడిని విచారించిన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అభం శుభం తెలియని పసివాడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
also read : ఫౌండేషన్ ముసుగులో రాజకీయ అవతారమా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు