
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ : నల్లగొండ పట్టణం మరోసారి మానవత్వాన్ని తలదించుకునే ఘటనకు వేదికైంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైట్ స్కూల్ సమీపంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసుపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ దారుణ ఘటనను జిల్లా పోలీసు అధికారి శరత్ చంద్ర పవార్ (ఎస్‌పీ) స్వయంగా పరిశీలించారు. మంగళవారం సాయంత్రం ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటనా స్థలాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఆధారాలు సేకరించారు. అనంతరం నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ పురోగతిని సమీక్షించారు.
ఎస్పీ, శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, నిందితుడు గడ్డం కృష్ణపై రేప్ మరియు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశాం. అతని సహాయకులుగా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అతను మరింతగా హెచ్చరిస్తూ, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, హత్యలు, హింసలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు. ఇలాంటి దుర్మార్గులను చట్టం ముందు నిలబెట్టి ప్రజలకు న్యాయం చేస్తాం, అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు.
Read More : ప్రేమ పేరుతో, లైంగిక దాడి.. దారుణ హత్య
ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే నిందితుడు గడ్డం కృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కృష్ణ నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డులు సేకరించగా, మృతురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా రికార్డు చేస్తున్నారు. నల్లగొండ పట్టణంలో ఈ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రజలు, మహిళా సంఘాలు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి, త్వరితగతిన ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. నిందితుడు గడ్డం కృష్ణపై రేప్ మరియు పోక్సో కేసులు నమోదు చేయగా, విచారణ కొనసాగుతోంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యటనతో దర్యాప్తు వేగం పెరిగింది. నిందితుడికి కఠిన శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని వార్తలను చదవండి …