జాతీయం

కొండా సురేఖ పై... తీవ్ర ఆగ్రహానికి

ఈ మధ్య తెలంగాణలో కొండ సురేఖ నాగార్జున అలాగే కేటీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి తెగ వైరల్ అయిపోయాయి. వీటి మీద ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా కింద కోర్టు మెట్లు కూడా ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటికే చాలామంది టాలీవుడ్ నుండి హీరోలు మరియు హీరోయిన్లు అందరు కూడా స్పందించారు.

తాజాగా ఇప్పుడు ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ ఈ విషయంపై మరోసారి స్పందించారు. కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై వీళ్లిద్దరు కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. కొండా సురేఖ చేసిన వాక్యాలు బాధ్యతారహితమైనవని,నిరాధారమైనవి. ఎంతోమంది ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకురాలు అయినటువంటి కొండ సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగ్బ్రాంతకరం. ఇలాంటి ప్రవర్తన రాజకీయ నాయకుల్ని మేం సహించలేము అని రామ్ చరణ్ అన్నాడు. అలాగే మరోవైపు ప్రభాస్ కూడా ఈ విషయంపై తీవ్రంగా ఫైర్ అయ్యాడు. భవిష్యత్తు రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరపరచడం కరెక్ట్ కాదు అని రాజకీయాల కంటే వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రభాస్ చెప్పుకోచ్చాడు. ప్రభాస్ మరియు రామ్ చరణ్ వీళ్లిద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ కొండా సురేఖ పై ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నా కానీ తెలంగాణ సీఎం మాత్రం సరిగా స్పందించట్లేదు. అయితే అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా ఈ విషయంపై ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కారు. అంతేకాకుండా టాలీవుడ్ లో నటులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సినిమాలకి రాజకీయాలకు లింకు పెట్టకండి. రాజకీయం కోసం వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Spread the love
Back to top button