-
వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ సంచాలకులు బి.గోపి కి విజ్ఞప్తి
-
బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్
క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా యూరియా సరఫరా లో ప్రవేశపెట్టిన యాప్ బుకింగ్ విధానం వల్ల సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఆన్లైన్ యాప్ బుకింగ్ విధానం ఎత్తివేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగమ్ గౌడ్ కోరారు.
గురువారం హైదరాబాదులోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వ్యవసాయ సంచాలకులు బి.గోపి ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ… టెక్నాలజీ పై అవగాహన లేని రైతులు యాప్ లో బుక్ చేసుకోవడం సాధ్యం కాక,కొంత మంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ లేక బుకింగ్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని అన్నారు.
స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు యూరియా బుక్ చేసుకుంటే రైతులు ఉన్న గ్రామం కాకుండా 40 నుండి 45 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో యూరియా వచ్చిందని అక్కడికి పోయి తీసుకోమని చెప్తున్నారని అన్నారు. ఒక్క యూరియా బస్తా కోసం అనేక తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ సంచాలకులు బి.గోపి ని కోరారు.





