
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం లో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు అని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితుల్లో నేను అధికారం చేపట్టాను. అధికారం చేపట్టి దాదాపు రెండేళ్లు కాబోతున్న.. పరిస్థితులు వేగంగా ఎలా మారిపోతున్నాయో మీరే చూస్తున్నారు కదా అని అన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం, పెద్ద ఇర్లపాడు గ్రామంలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఛీఛీ అనే పరిస్థితి ఉండేది అని అన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భలే భలే అని అంటూ అభినందిస్తున్నారు అని పేర్కొన్నారు. మరోవైపు వచ్చే ఏడాది లోపు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2019లో టీడీపీ ప్రభుత్వమే కంటిన్యూ అయి ఉంటే ఒక ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేదని తెలిపారు. 2026 లోపు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి శ్రీశైలం మరియు గోదావరి జలాలను కూడా మీతో తాగిస్తామంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా నిన్న జరిగినటువంటి సభలో ప్రతి ఒక్కరు కూడా వెలుగొండ ప్రాజెక్టు గురించి సీఎం ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా?.. అని ఆసక్తిగా ఎదురు చూశారు. వాళ్ళ ఆలోచించిన విధంగానే చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చారు.
Read also :ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో సంచలనం.. డా. షాహీన్ అరెస్ట్!
Read also : అర్ధరాత్రి క్షమాపణలు చెప్పిన మంత్రి.. మరి కేసు వెనక్కి తీసుకుంటారా?





