
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మస్కిటో కాయిల్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. చలికాలం కావడంతో దోమలు ఎక్కువగా ఉన్న కారణంగా చాలామంది కూడా దోమలను పోగొట్టడానికి మస్కిటో కాయిల్ ను వాడుతున్నారు. అయితే ఈ మస్కిటో కాయిల్స్ అనేవి ఎంత ప్రమాదమో మరోసారి రుజువయింది. మస్కిటో కాయిల్స్ వల్ల ప్రాణాలు కూడా పోతాయి అనడంలో ఇటువంటి సందేహం లేదు దానికి ఉదాహరనే ఈ వార్త. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనిల్ కుమార్ తన తోమ్మిదేళ్ల కొడుకుతో చక్కగా భోజనం చేసి పడుకునే సమయానికి దోమలు ఉన్నాయి అని.. వెంటనే మస్కిటో కాయిల్ ను పెట్టుకుని నిద్రపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ మస్కిటో కాయిల్ అనేది దుప్పటికి అంటుకోవడంతో చిన్నగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు దాటికి 9 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని తండ్రి అలాగే స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అబాలుడు మృతి చెందాడు. దీంతో మస్కిటో కాయిల్ కూడా మృతికి కారణమవుతుందా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే మస్కిటో కాయిల్ ఉపయోగించినప్పుడు మీరు నిద్రలోకి జారుకుంటున్న సమయంలో దానిని ఆపివేయాలి. లేదా రాత్రి పొడుగూతా ఉంచుకోవాలని అనుకుంటే బెడ్ కు కాస్త దూరంగా ఉంచుకోవాలి.
Read also : రేపే ముక్కోటి ఏకాదశి.. ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం





