Homeఆంధ్ర ప్రదేశ్కడప, బెంగళూరు కొత్త రైల్వే లైన్

కడప, బెంగళూరు కొత్త రైల్వే లైన్

  • రైల్వే మంత్రికి విన‌తి ప‌త్రం అంద‌జేత‌
  • ఉపాధి అవ‌కాశాలు మెరుగవుతాయి
  • ఎంపీ ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి

కడప, క్రైమ్ మి ర్ర‌ర్‌: కడప నుంచి బెంగళూరుకు కొత్త రైలు మార్గంపై రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ రైల్వే లైన్ రాయలసీమ అభివృద్ధికి కీలకమైనదని పురందేశ్వరి వివరించారు.

ఈ రైల్వే లైన్‌పై సమీక్ష చేసి పనుల్ని వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే ప్రాజెక్టులపై ఎంపీల నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళుతుండ‌గానే తాజా మ‌రో కొత్త రైల్వే ప్రాజెక్టుపై రైల్వేమంత్రికి విన‌తులు అందజేశారు.

రాయలసీమకు కీలకమైన కడప-బెంగళూరు రైల్వే లైన్‌ ప్రాజెక్టు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ రైలు మార్గం రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకమైనదని పురందేశ్వరి అన్నారు. ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి పునఃసమీక్షించి, పనులను వేగవంతం చెయ్యాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను కోరారు. ఏపీ రవాణాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా పురందేశ్వరి వెంట ఉన్నారు.

వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2008లో మంజూరు చేశారని మొత్తం 266 కి.మీ నుంచి 268 కి.మీ చేపట్టాల్సి ఉండగా కేవలం కడప-పెండ్లిమర్రి మధ్య 21 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తి చేశారన్నారు. ఈ రైల్వే లైన్‌ ద్వారా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కుకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు.

రాయలసీమ అభివృద్ధికి అత్యంత కీలకమైన కడప–బెంగళూరు రైల్వే లైన్ ప్రాజెక్టును పరిశీలించి, త్వరితగతిన అమలు చేయాలని గౌరవ రైల్వే మంత్రి ని కోరారు.. 2008లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పరిమిత పురోగతితోనే కొనసాగుతోంది. జిల్లాలైన కడప, అన్నమయ్య ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఎంతో కీల‌క‌మన్నారు.

కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్‌కు ఊతం, బెంగళూరుతో నేరుగా రైల్వే అనుసంధానం, పరిశ్రమలు వృద్ధి, విద్యార్థులు, రోగులు, ఉద్యోగార్థులకు సౌలభ్యం, పర్యాటకాభివృద్ధి ,ఉపాధి అవకాశాలు మెరుగు ప‌డుతాయ‌న్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వంతో వ్యయ భాగస్వామ్య విధానాన్ని మళ్ళీ పరశీలించి, సమన్వయం చేసి తగిన సమయంలో పూర్తి చేయాలని కోరారు.. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే బెంగళూరు త్వరగా చేరుకోవచ్చున‌ని తెలిపారు.

Most Popular

Recent Comments