క్రైమ్ మిర్రర్ ప్రతినిధి నకిరేకల్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నవంబర్ 11, 2025న జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ తరపున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఇందిర నగర్ లోని 94వ బూత్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
Also Read:తెలంగాణలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెయ్యి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు తెలియజేశారు.
ఈ ప్రచారంలో ఆయనతో పాటు TPCC మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, నాయకులు గంగుల రాజిరెడ్డి, గోదాసు పృధ్విరాజ్, పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…





