Homeతెలంగాణప్రజల ఆరోగ్యాలతో చెలగాటం.. తాగునీటి ట్యాంక్‌లో కోతుల మృతదేహాల కలకలం

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం.. తాగునీటి ట్యాంక్‌లో కోతుల మృతదేహాల కలకలం

•కుదాభక్ష్‌పల్లిలో, సర్పంచ్ అధికారుల ఘోర నిర్లక్ష్యం.
•జిల్లా కలెక్టర్ చర్యలకు గ్రామస్తుల డిమాండ్

మర్రిగూడ,క్రైమ్ మిర్రర్ :- అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల బాధ్యతారాహిత్యం, అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన, కనీస బాధ్యతను మరిచిన స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు ఏకంగా, ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాంతక చెలగాటమాడుతున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం, కుదాభక్ష్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల, ప్లాట్లలో తాగునీరు సరఫరా చేసే సాగర్ వాటర్ ట్యాంక్‌లో, కుళ్ళిపోయిన కోతుల మృతదేహాలు లభ్యమవడం, స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ట్యాంకులకు సరైన మూతలు లేకపోవడం, వాటిని క్రమ పద్ధతిలో పర్యవేక్షించకపోవడం వల్లే, ఈ ఘోరం జరిగిందని స్పష్టమవుతోంది. నీటి ట్యాంక్‌లో పడి కోతులు మరణించి రోజులు కావడంతో, ఆ కళేబరాలు నీటిలోనే కుళ్ళిపోతూ, ట్యాంక్ అంతా విషపూరితంగా మారిన పరిస్థితి, నిండు నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఈ అపరిశుభ్రతను, ఘోరాన్ని కనీసం గమనించని పంచాయతీ సిబ్బంది, అదే కంపుకొడుతున్న కుళ్ళిన నీటిని, యథేచ్ఛగా గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సరఫరా అవుతున్న నీరు, దుర్వాసన వస్తున్నా, రంగు మారినా అధికారులు ముందస్తుగా స్పందించకపోవడం గమనార్హం. ఈ విషపూరితమైన నీటిని తాగిన కుదాభక్ష్‌పల్లి గ్రామస్తులు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ప్రచారం.!? కనీసం తాగునీటి ట్యాంకులను పరిశీలించాలనే జ్ఞానం కూడా, అధికారులకు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు గ్రామాల్లో పారిశుధ్యాన్ని, తాగునీటి శుద్ధతను నిరంతరం పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శి, తన విధులను పూర్తిగా గాలికి వదిలేశారని, కార్యాలయ గదులకే పరిమితమై ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ అమానవీయ, అత్యంత నిర్లక్ష్య పూరితమైన ఘటనపై, జిల్లా కలెక్టర్ తక్షణమే ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న వారిని ఏ హోదాలో ఉన్న తక్షణమే సస్పెండ్ చేయాలని, కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించి, గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామస్తులకు తక్షణ చికిత్స అందించాలని, తాగునీటి ట్యాంకులను పూర్తిగా శుద్ధి చేయించి, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని, లేనిపక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు, మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేస్తామని పలువురు కుదాభక్ష్‌పల్లి గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.

‘హై లెస్సో’ మూవీ నుంచి సుధీర్ ఆనంద్ బర్త్ డే పోస్టర్…!

పురుష మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది – హీరో పవన్ కళ్యాణ్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు