అంతర్జాతీయం

ఏ ఒప్పందమూ జరగలేదు.. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్!

Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటను ఇరాన్ ఖండించింది. ఇరుదేశాలు కాల్పుల విరమణ జరిగిందని, 24 గంటల్లో అమల్లోకి వస్తుందని ట్రంప్ చెప్పగా, అలాంటి ఒప్పందం ఏదీ జరగలేదని టెహ్రాన్ అనౌన్స్ చేసింది. అయితే, యుద్ధాన్ని కొనసాగించాలనే ఉద్దేశం తమకు లేదని ప్రకటించింది.

ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్

అటు ట్రంప్ స్టేట్ మెంట్ ను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. సైనిక కార్యకలాపాలను ఆపే అంశంపైనా ఒప్పందాలు ఏవీ కుదరలేదన్నారు. ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్చి కీలక ప్రకటన చేశారు. అయితే, తమకు యుద్ధం కొనసాగించాలనే ఆలోచన లేదని తెలిపారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిందని, వాళ్లు దాడులు ఆపడం మొదలుపెడితే తాము ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం కాల్పుల విరమణపై తాము ఆలోచించలేదన్నారు. సైనిక దాడుల విరమణపై నిర్ణయం తీసుకుంటామని అరాగ్చి వెల్లడించారు.

12 రోజుల యుద్ధం ముగిసిందన్న ట్రంప్

తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. ఈ ఒప్పందం 24 గటంల్లో అమల్లోకి వస్తుందని ఆయన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించారు. 12 రోజుల యుద్ధానికి ముగింపు పడినట్లు అయ్యిందన్నారు. మరో 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందన్నారు. యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరక ముందే ట్రంప్ ప్రకటన చేయడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. భారత్-పాక్ విషయంలోనూ యుద్ధాన్ని ఆపింది తానేనని ప్రకటించుకున్నారు ట్రంప్. ఇప్పుడు కూడా ఈ యుద్ధాన్ని తానే ఆపాననే క్రెడిట్ ను తన ఖాతాలోకి వేసుకునేందుకు ట్రంప్ ఈ ప్రకటన చేసిన ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది, ట్రంప్ కీలక ప్రకటన!

Back to top button