ఆంధ్ర ప్రదేశ్

కన్నీళ్లతో వైఎస్ విజయమ్మ వీడియో.. జగన్ అంత పని చేశాడా!

వైఎస్ విజయమ్మ. తనపై తన కొడుకు హత్యా ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా?

వైఎస్సార్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఆస్తుల కోసం సొంత చెల్లిని జగన్ వేధిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. తల్లి విజయమ్మను జగన్ దూరం పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం జరిగింది. అయితే విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర ఉందని.. జగన్ హస్తం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసినట్లే.. 2024 ఎన్నికలకు ముందు విజయమ్మ హత్యకు జగన్ ప్లాన్ చేశారని కొందరు టీడీపీ నేతలు ఆరోపించడం తీవ్ర కలకలం రేపింది.

తన కారు ప్రమాదంపై తాజాగా స్పందించారు వైఎస్ విజయమ్మ. తనపై తన కొడుకు హత్యా ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు. ఇటీవల విడుదలైన రెండు లేఖలు తాను రాసినవేనని క్లారిటీ ఇచ్చారు విజయమ్మ. నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం తన కొడుకు జగన్ కు లేదని స్పష్టం చేశారు. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తా వైఎస్ విజయమ్మ హెచ్చరించారు.

ఇవికూడా చదవండి .. 

Back to top button