క్రైమ్

మరో ఆలయంలో దాడి.. తెలంగాణలో అసలేం జరుగుతోంది?

తెలంగాణలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాలపై దాడుల నేపథ్యంలో బిజెపి, భజరంగ్ దళ్, వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నా ఈ దాడులు ఆగడం లేదు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటన మరవక ముందే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరో దేవాలయం లోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్ పోర్ట్ కాలనీ హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న నవగ్రహాల విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం పూజ చేసేందుకు వచ్చిన పూజారికి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో కాలనీ వాసులకు సమాచారం ఇచ్చాడుహుటాహుటిన హనుమాన్ దేవాలయానికి చేరుకున్న కాలనీవాసులు విగ్రహాల ధ్వంసం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహాల ధ్వంసంపై ఆధారాలను సేకరించారు.సంఘటన స్థలంలో ఓ అనుమానితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.నవగ్రహాల ధ్వంసం పై నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. ఏదో ఒకచోట హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దేవాలయాలపై దాడులకు తెగబడ్డ నిండుతులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని అంటున్నారు

Back to top button