హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒక జాతియా అవార్డు గ్రహీత అయినటువంటి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అనేది పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్ సీఎం రేవంత్ పై మండిపడ్డారు. తొక్కిసిలాటలో జరిగిన దానికి నాకు పూర్తిగా బాధగానే ఉంది అని అన్నారు. నిజంగా విఫలమైంది ఎక్కడ పోలీసులు మీ చేతగాని ప్రభుత్వ తనమే అని కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ మండిపడ్డారు.
బ్రేకింగ్ న్యూస్!… పుష్పరాజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు?
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ అవార్డు పొందిన ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ అని అంతటి వ్యక్తిని మీరు సాధారణ విచారణలు చేయకుండా వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి ఎలా తీసుకువెళ్తారని మండిపడ్డారు. అల్లు అర్జున్ ను ఓ సాధారణ నేరస్తుడికి భావించి ఇలా చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు ఇలా ప్రవర్తించడమైనది సరైన విషయం కాదని కాబట్టి దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ ప్రకటన ద్వారా వెల్లడించారు.
ప్రపంచ చెస్ చాంపియన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ?
అయితే ఇవాళ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా తాజాగా వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ ను హాస్పటల్ కు తరలించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ షో సందర్భంగా రేవతి అనే మహిళా మరణించిన విషయం మనందరికీ తెలిసిందె. ఈ ఘటన సందర్భంగా నే పోలీసులు ఇవాళ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు.