Homeతెలంగాణపేదోళ్ల సొంతింటి కళ ఇందిరమ్మ ఇల్లు : సర్పంచ్ భట్టు అనురాధ రెడ్డి

పేదోళ్ల సొంతింటి కళ ఇందిరమ్మ ఇల్లు : సర్పంచ్ భట్టు అనురాధ రెడ్డి

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- మాడ్గుల మండలం కొలుకులపల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన శిరగొని లక్ష్మమ్మ,పెద్దయ్య దంపతులు తమ కొత్త ఇంటిలో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆనందంగా గృహప్రవేశం చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భట్టు అనురాధ , ఏఎంసీ మాజీ చైర్మన్ భట్టు కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కొత్త ఇంటిలోకి ప్రవేశించిన పెద్దయ్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో పెద్దయ్య దంపతులు సర్పంచ్ భట్టు అనురాధ కిషన్ రెడ్డి ని సన్మానించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంత ఇళ్లు కలగడం సంతోషకరమని గ్రామస్తులు పేర్కొన్నారు.

మరోసారి ట్రంప్ ఆరోగ్యంపై చర్చ

కలలో బంగారం, వెండి కనిపిస్తే ఏమవుతుందంటే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు