ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వైసీపీ?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఇప్పటికే శ్రీకాకుళం మొదలుకొని కింద అనంతపురం వరకు కూడా అన్ని జిల్లాలలోని నియోజకవర్గాలలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఉధృతంగా ఆందోళనలు చేస్తున్నారు. “ప్రజా ఉద్యమం” పేరిట నియోజకవర్గాల వ్యాప్తంగా ర్యాలీలు చేపడుతున్నారు. ఈ ర్యాలీలలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ అభిమాన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఇక తాజాగా గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుకు మరియు పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోగా అంబటి రాంబాబు వారిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇలా ఒక గుంటూరు జిల్లాలోనే కాకుండా కడప, కర్నూలు, చిత్తూరు మొదలుకొని పలు జిల్లాలలో వైసీపీ నాయకులందరూ కూడా ఉధృతంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రైవేట్ కాలేజీల నిరసనలో భాగంగా కోటి సంతకాల సేకరణ కూడా నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని నియోజకవర్గాలలో ఈ ఉదృత పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.

Read also : బ్యాంక్ కు లంచ్ బ్రేక్ అనేది ఉండదు.. ప్రజలు గమనించాలి!

Read also : ట్రాఫిక్ లోనే సగం జీవితం గడిచిపోతుంది.. మరి ఎప్పుడు మారేనో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button