రాయచోటి, క్రైమ్‌మిర్రర్: దూరదర్శిని సినిమా సరికొత్త కథ తో అహ్లాదంగా నవ్వులు పండించే పల్లెటూరి పరిమళమని చిత్ర హీరో బొజ్జ సువిక్షిత్ రెడ్డి అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో చిత్రం హీరో హీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులు చిత్ర ప్రదర్శన చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లు మాట్లాడుతూ దూరదర్శిని పల్లెటూరి జ్ఞాపకాలతో సరికొత్త వినోదం పంచిందన్నారు.వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన గ్రామీణ నేపథ్య కథలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఇష్టమే. అదే కోవలో పక్కా పల్లెటూరి సామాజిక అంశాలతో, నవ్వులు పూయించే పాత్రలతో ‘దూరదర్శిని ప్రేక్షకులను అలరిస్తుంద నితెలిపారు.
మన ఊరి కథ.. మనందరి వ్యథ.. నవ్వుల జాతర – అదే ‘దూరదర్శిని.వినోదానికి కొత్త కిటికీ..”అచ్చమైన పల్లెటూరి పరిమళం..ఈ ‘దూరదర్శిని*సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు* తెలిపారు చిత్ర బృందాన్ని లయన్స్ క్లబ్ రిజినల్ చైర్మన్ షేక్ మహమ్మద్* శాలువులతో సత్కరించి సన్మానించారు. నేటి యాంత్రిక జీవనంలో కాసేపు మన మూలాలను గుర్తు చేసుకుంటూ, హాయిగా నవ్వుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా యువతకు తమ తల్లిదండ్రుల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి ‘దూరదర్శిని’ ఒక చక్కని మార్గం అని అన్నారు.
ఆ చిత్రం హిరో బొజ్జ సువిక్షత్ రెడ్డి,లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ షేక్ మహమ్మద్ ,దేసిరెడ్డి ప్రతాప్ రెడ్డి .అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రసాద్ హాల్ నందు ప్రేక్షకులతో కలిసి చిత్ర బృందం సందడి చేశారు.చిత్ర బృందానికి అయన అభిమానులు బాణాసంచాలు పేలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు.హిరో తో ఫోటోలు దిగేందుకు పిల్లలు పెద్దలు ఉత్సాహం చూపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 90ల నాటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ ను నేటి ఆధునిక కాలంలో కూడా అలనాటి జ్ఞాపకాలను, పల్లెటూరి స్వచ్ఛతను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు.
అటువంటి ఒక వింటేజ్ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామానే ‘దూరదర్శని’. రూపొందించమన్నారు.90వ దశకంలో గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘మట్టపరు’ అనే ఒక అందమైన గ్రామంలో కులమతాలకు అతీతంగా ఊరి జనం ఎలా కలిసిమెలిసి ఉండేవారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించామన్నారు.కేవలం ప్రేమ మాత్రమే కాకుండా, చదువు ప్రాముఖ్యత మరియు తల్లిదండ్రుల అనురాగం ఎంత గొప్పదో తెలిపే సందేశం ఈ చిత్రంలో ఉందన్నారు.అప్పటి కాలం నాటి రేడియోలు, సైకిల్ ప్రయాణాలు మరియు మొదటిసారి గ్రామంలోకి ‘దూరదర్శని’ (TV) వచ్చినప్పుడు కలిగే ఉత్సాహం ప్రేక్షకులను మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్తుందన్నారు.
హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్ భద్రం, లావణ్య రెడ్డి తమ నటనతో ప్రేక్షకులను ఎంతో అక్కట్టుకున్నయన్నారు. కార్తికేయ కొమ్మి పల్లెటూరి వాతావరణాన్ని, ఎమోషన్స్‌ను చాలా సహజంగా తెరకెక్కించారని, వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించి నట్లు గుర్తు చేశారు.గోదావరి జిల్లాల పచ్చదనం, నాటి ఇళ్ళు మరియు మనుషుల స్వచ్ఛత సినిమాకు ప్రధాన బలమని,”మీ చిన్ననాటి జ్ఞాపకాలను పలకరించే మధుర కావ్యం… మన ‘దూరదర్శని’!” అని అన్నారు.భవిష్యత్తులో కుడా మంచి మంచి సినిమాలు తీయాలని వారు ఆకాక్షించారు