పోలింగ్‌కేంద్రాల  ప‌రిశీల‌న‌

  • భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష
  • జిల్లా ఎస్పీ డి.జానకి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, క్రైమ్ మిర్ర‌ర్ః

మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌హాబూబ్ న‌గ‌ర్ జిల్లా ఎస్‌పీ డి.జాన‌కి పోలింగ్ కేంద్రాల‌ను సంద‌ర్శించారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌రిధిలోని టీచ‌ర్స్ కాల‌నీలోని బ్రిలియంట్ స్కూల్‌, ఠాగూర్ స్కూల్‌, గాంధీ రోడ్ స్కూల్ పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించారు.

ఈసంద‌ర్భంగా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఏర్పాటు చేసిన భ‌ద్ర‌త‌, సిబ్బంది, సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌, క్యూలైన్ నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్షించారు.

ఈసంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ ఎక్క‌డ‌కూడ అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లుజ‌రుగ‌కుండా అప్ర‌మ‌త్తంగా విధులు నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు, సిబ్బందికి సూచించారు.

ప్ర‌శాంత వాతావ‌ర‌ణ‌లో ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి…
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. సీఐలు, డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు విధులు నిర్వర్తిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయని పేర్కొన్నారు.

అదనంగా రూట్ మొబైల్ బృందాలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ శాంతి భద్రతలను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నాయని వివరించారు.

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button