
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ఎన్నో రోజుల నుంచి డేటింగ్ లో ఉన్నారని అలాగే ఎన్నో చోట్లకు ఇద్దరు కలిసి షికారులకు వెళ్లారని కూడా సోషల్ మీడియాలో చాలానే వార్తలు వచ్చాయి. అయితే రెండు రోజుల క్రితం అందరూ ఊహించినట్టుగానే విజయ్ మరియు రష్మిక మందన ఇద్దరూ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ ఎంగేజ్మెంట్ విషయంపై వీరిద్దరూ కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి లోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ విజయ్ దేవరకొండ ను చాలా మంది కలవడానికి ప్రయత్నాలు చేశారు. వాటితో పాటుగా కొన్ని పిక్స్ ని కూడా తీశారు. ఈ సందర్భంలోనే విజయ్ దేవరకొండ చేతికి ఒక ఉంగరం అనేది కనిపించింది. మరి ఈ ఉంగరం ఆ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఉంగరమేనా అని అని భావిస్తున్నారు. ఇదే ఆ ఎంగేజ్మెంట్ రింగ్ అయి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంది. దీనిపై ఇరువురు ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదని మరోవైపు సందేహ పడుతున్నారు.
Read also : స్థానిక ఎన్నికలు లేనట్టేనా..? రిజర్వేషన్ల వివాదంతో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ
Read also : ఈ సినిమా చూసి మనోళ్లు సిగ్గుపడాలి… మిగతా వాళ్ళకి హ్యాట్సాఫ్ : ఆర్జీవి