
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ కోల్పోయి అయోమయంలో ఉన్నటువంటి టీమిండియా కు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గాయం కారణంగా ఆస్ట్రేలియా తో మూడవ వన్డే మ్యాచ్ కు దూరమైనా తెలుగు ప్లేయర్, టీమిండియా యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈనెల 29వ తేదీ నుంచి జరగబోయేటువంటి ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తాజాగా క్రిక్బజ్ వెల్లడించింది. ఒకవేళ తొలి మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి ఆడిన ఆడకపోయినా… మిగతా నాలుగు టి20 మ్యాచ్ లలో పక్కగా ఆడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
Read also : తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను వ్యక్తిగతంగా కలవనున్న విజయ్!
మరోవైపు మూడవ వన్డేలో అద్భుతమైన క్యాచ్ను పట్టిన సమయంలో శ్రేయశ్ అయ్యర్ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శ్రేయస్ అయ్యర్ కోలుకోవడానికి కొన్ని వారాలు పట్టవచ్చు అని… నవంబర్ 30వ తేదీ నుంచి సౌత్ ఆఫ్రికా తో జరగబోయేటువంటి వన్డే సిరీస్ లో అయ్యర్ ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. కాగా ఆస్ట్రేలియాతో జరగబోయేటువంటి ఐదు t20 మ్యాచ్ లకు సతీష్ కుమార్ రెడ్డి కీలక ప్లేయర్ గా మారనున్నారు. ఎందుకంటే టీ20 లలో నితీష్ కుమార్ రెడ్డికి చాలానే మంచి రికార్డులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో నితీష్ కుమార్ రెడ్డి ఆడాలని రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులతో పాటుగా ఇండియన్ ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా వన్డే మ్యాచ్లలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో చాలా కీలకము కానున్నారు. వీరిద్దరూ గాయం నుంచి కోల్కొని తిరిగి మళ్ళీ మైదానంలో అడుగు పెట్టాలని చాలామంది ఆశిస్తున్నారు.
Read also : సెంచరీ తో విరుచుకుపడ్డ రోహిత్.. ICC వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం?





