
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి ఢిల్లీ రావు ధాన్యం తడిసిన రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఈ మధ్యకాలంలో తుఫాన్ కారణంగా విపరీతంగా కురిసినటువంటి వర్షాలకు రైతులు పండించినటువంటి ధాన్యం పూర్తిగా తడిసిపోయి.. రైతులు ఆందోళన చెందిన వార్తలు ప్రతి రోజు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా 17% వరకు తడిసి ఉన్న ధాన్యాన్ని కూడా కొంటాము అని సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి ఢిల్లీ రావు రైతులకు హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని వివిధ రైతు సంఘాల నేతలు ఢిల్లీ రావు ను కలిసి వినత పత్రం అందజేయగా అతను వెంటనే సరే అని చెప్పారు. మద్దతు ధర కన్నా అదనంగా గోనె సంచులు మరియు రవాణాకు అయినటువంటి ఖర్చులు ఇవ్వాలి అని రైతు సంఘాలు కోరారు. అలాగే ఈ మధ్యకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో మిల్లర్ల యజమాన్యాలు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారు అని.. వాటిని వెంటనే అడ్డుకోవాలి అని ఎండిని కోరారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు తీవ్రంగా పట్ట నష్టం జరగగా రైతులు ధాన్యం కొనుగోలు, తేమ శాతం అంచనాలపై ఏవైనా సమస్యలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి ఢిల్లీ రావు రైతులకు తెలిపారు. కాబట్టి ధాన్యం తడిసిన రైతులు ఎవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు అని.. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది అని సూచించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పంట నష్టం గురించి ఆరాతీస్తున్నారు. నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించడంతోపాటు.. తడిసినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
Read also : మిర్జాగూడ బస్సు ప్రమాదం.. అదంతా అబద్ధం.. టిప్పర్ యజమాని సంచలన వ్యాఖ్యలు!
Read also : మేము ఎవరికి అనుచరులం కాదు.. అది రెడ్డి అయినా?.. రావు అయినా? : అక్బరుద్దిన్





