
మహారాష్ట్రలో మరోసారి వివాహేతర సంబంధం కారణంగా జరిగిన దారుణ హత్య ఘటన బయటపడింది. జల్నా జిల్లా సోమ్తానా గ్రామంలో పరమేశ్వర్ రామ్ టేడే అనే వ్యక్తిని అతని భార్య మనీషా, అలాగే తమ్ముడు జ్ఞానేశ్వర్ కలిసి నరికి చంపిన విషయం వెలుగులోకి రావడంతో ఊరంతా ఉలిక్కిపడింది. పరమేశ్వర్, మనీషా దంపతులు టేడే తమ్ముడు జ్ఞానేశ్వర్‌తో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మనీషా, జ్ఞానేశ్వర్ మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అనుమానం పెంచుకున్న పరమేశ్వర్ తన భార్యను మందలించడంతో ఆమె కోపం పెరిగింది. తన అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నట్లు భావించి భర్తను ఏదైనా చేసి తొలగించాలని నిర్ణయించింది.
తనతో కలిసి ఉన్న జ్ఞానేశ్వర్‌కు కూడా ఇదే ఆలోచన కలగడంతో ఇద్దరూ పరమేశ్వర్‌ను చంపేందుకు పథకం రచించారు. అనుకున్న రోజు గొడ్డలితో పరమేశ్వర్‌పై దాడి చేసి, అతన్ని దారుణంగా నరికి హతమార్చారు. హత్య అనంతరం మృతదేహం బయటపడకుండా ఉండేందుకు గోనీ సంచిలో చుట్టి వాలా- సోమ్తానా చెరువులో పడేశారు. కొన్ని గంటల తర్వాత చెరువులో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. దర్యాప్తులో ఇది హత్య కేసుగా నిర్ధారించారు. పరమేశ్వర్ కనిపించకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా, మనీషా, జ్ఞానేశ్వర్‌లపై అనుమానం పెరిగింది.
అనంతరం ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కఠినంగా విచారించగా, చివరకు ఇద్దరూ నేరాన్ని ఒప్పుకున్నారు. తమ అక్రమ సంబంధం తెలిసి పోవడంతో పరమేశ్వర్‌ను తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ ఘోర హత్య చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. గ్రామస్తులు భార్య, మరిది కలిసి ఈ విధంగా దారుణంగా హత్య చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సంబంధాలు, విలువలు దెబ్బతింటున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని స్థానికులు వ్యాఖ్యానించారు.
ALSO READ: Interesting Facts: ప్రపంచంలో అత్యంత డేంజరస్ ఆయుధాలు ఇవే.. క్షణాల్లోనే మరణం





