
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- రేపటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది. ఈ ట్రోఫీలో ఆయా రాష్ట్రాల ప్లేయర్లు మాత్రమే కాకుండా జాతీయ జట్టులో ఉన్నటువంటి ప్రతి ఆటగాడు కూడా తప్పనిసరిగా పాల్గొనాలి అని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. జాతీయ జట్టులో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు కనీసం ఈ ట్రోఫీలో రెండు మ్యాచ్లు అయినా ఆడాలి అని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం దిగ్గజ ప్లేయర్లు అయినటువంటి రోహిత్ మరియు కోహ్లీలకు కూడా వర్తిస్తుంది అని బీసీసీఐ స్పష్టం చేయగా భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా సంతోషంలో పడిపోయారు. ఇది దేశీవాళి క్రికెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ వన్డే టోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ మరియు హర్షిదీప్ సింగ్ లాంటి జాతీయ జట్టులో ఉన్నటువంటి ప్లేయర్లు అందరూ కూడా ఆడునున్నారు. దీంతో చాలామంది కళ్ళన్ని కూడా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీపై పడ్డాయి. ఈ టోర్నీలో ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ మరోవైపు ముంబై తరుపున రోహిత్ శర్మ ఆడనున్నారు. ఈ విజయ్ హజారే ట్రోఫీ రూపంలో మళ్లీ ఈ స్టార్ ప్లేయర్లను మైదానంలో చూడవచ్చు అని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read also : కోటి సంతకాలు ఆత్మలు పెట్టాయా?.. మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆగ్రహం!
Read also : “అఖండ-2” కలెక్షన్లు ఎంతో తెలుసా..?





