
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వచ్చినటువంటి భారత పురుషుల జట్టు అలాగే భారత మహిళల జట్టు క్రికెట్ ప్లేయర్లు అందరూ కూడా సింహాచలం దేవస్థానంలో అడుగుపెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విశాఖపట్నంలోని సింహాచలం వారాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఇప్పటికే ఎంతోమంది స్టార్ క్రికెటర్లు దర్శించుకున్నారు. భారత్ మరియు సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్నటువంటి వన్డే మ్యాచ్ సందర్భంలో కూడా భారత జట్టు ప్లేయర్లు కోహ్లీ అలాగే కోచ్ గౌతమ్ గంభీర్ సహా ఎంతోమంది స్టాఫ్ సింహాచలంలో అడుగుపెట్టి స్వామివారిని దర్శించుకున్నారు.
Read also : హిందువులారా దయచేసి మేల్కోండి.. బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించండి : కాజల్
ఇక తాజాగా నిన్న కూడా టీమిండియా ఉమెన్స్ టీం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్లేయర్ లందరూ కూడా ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి ప్రసాదాలను కూడా స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా క్రికెటర్లకు ఘన స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అయితే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వస్తున్నారంటే ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ ఆలయంలో కప్ప స్తంభానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే కోరుకున్న ప్రతి కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయంలో దర్శించుకున్న ప్రతి ఒక్క ప్రముఖ వ్యక్తులు కూడా ఈ కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటారు. ఈ సింహాచలం ఆలయం ఎంత చరిత్ర కలిగి ఉన్నది కాబట్టే ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు విశాఖపట్నం వస్తే కచ్చితంగా ఈ ఆలయం ను సందర్శిస్తారు.
Read also : ఆఫ్గాన్ వీధుల్లో నేను బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనే తిరుగుతా : రషీద్ ఖాన్





