పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో తమ్ముడు ఒకటి. విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తుగా నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలై 27 ఏళ్లు పూర్తవుతున్నా దాని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు, భావోద్వేగ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ నటన ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అందులోనూ “వయ్యారిభామా నీ హంస నడక.. ఎందుకే ఈ తొందర తొందర” పాట అప్పట్లో యువతను ఊపేసింది. ఈ పాటలో కనిపించిన అందమైన నటి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుని “లవ్లీ” పేరుతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది.
View this post on Instagram
అయితే ఆ నటి అసలు పేరు అదితి గోవిత్రికర్. తమ్ముడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, ఆ ఒక్క చిత్రంతోనే భారీ గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు ఆమెను “లవ్లీ” పేరుతోనే గుర్తు పెట్టుకోవడం విశేషం. మోడలింగ్ రంగంలో చిన్న వయసులోనే అడుగుపెట్టిన అదితి, అనంతరం హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2001లో మిసెస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి గోవిత్రికర్ తన చిన్ననాటి జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యింది. భద్రత పరంగా తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనలు ముంబైలోని పన్వెల్ ప్రాంతంలో ఎదురయ్యాయని తెలిపింది. చిన్న వయసులోనే కొన్ని వేధింపుల ఘటనలను ఎదుర్కొన్నానని, వాటి నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టిందని వెల్లడించింది. ఆ సమయంలో తన వయసు కేవలం 6 నుంచి 7 సంవత్సరాల మధ్యే ఉండేదని తెలిపింది. తనను ఇబ్బంది పెట్టిన వారిలో తన తండ్రి స్నేహితుడు కూడా ఉన్నాడని చెప్పి షాక్ ఇచ్చింది.
తన విద్యార్థి దశలో ఎదుర్కొన్న కష్టాలను కూడా గుర్తు చేసుకుంది. 12వ తరగతి చదివే సమయంలో అగర్వాల్ తరగతుల కోసం దాదర్ ప్రాంతానికి వెళ్లేదాన్నని తెలిపింది. ఆ సమయంలో స్థానిక రైళ్లు అందుబాటులో లేకపోవడంతో బస్సుల్లోనే ప్రయాణించాల్సి వచ్చేదని చెప్పింది. ఆ ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కానీ ప్రజా రవాణా జీవితం మనిషికి ఎలా బతకాలో నేర్పిస్తుందని పేర్కొంది.
తమ్ముడు సినిమా తర్వాత చిత్రసీమకు దూరమైన అదితి ప్రస్తుతం 49 సంవత్సరాల వయసులో ప్రశాంత జీవితం గడుపుతోంది. అయినప్పటికీ ఆమె నటించిన ఆ ఒక్క తెలుగు సినిమా, అందులోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ALSO READ: మమతా బెనర్జీ కి షాక్…! ఆమె ప్రవేశపెట్టిన మతపరమైన పథకాలకు బ్రేక్…