క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు తలపొగరుతో కూడినటువంటి సెలబ్రేషన్స్ చేయడం పట్ల యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నుంచి విమర్శలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. 2023లో వన్డే వరల్డ్ కప్ భారత్ పై గెలిచిన ఆస్ట్రేలియా తన సెలబ్రేషన్స్ను తల పొగురితో చేసింది. ఆ సెలబ్రేషన్స్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆస్ట్రేలియా జట్టులోని క్రికెటర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఆ తర్వాత జరిగిన ప్రతి సిరీస్ లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోయింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత వైట్ బాల్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ప్రదర్శన దారుణంగా మారిపోయింది. ఇక టి20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలై ఇంటికి చేరుకుంది. ఇక ఆ తర్వాత పాకిస్తాన్, శ్రీలంక, సౌత్ఆఫ్రికా, ఇండియా వంటి జట్ల మీద వన్డే సిరీస్ లు కోల్పోయింది. ఇక గబ్బాలో వెస్టిండీస్ చేతిలో కీలక మ్యాచ్లను ఓడిపోయింది. ఇక నిన్నటి t20 వరల్డ్ కప్ లో పసికూన జట్ట అయినటువంటి జింబాబ్వే చేతిలో కూడా ఓటమిపాలవడంతో ఆస్ట్రేలియా జట్టుపై తీవ్ర విమర్శలతో పాటు జోక్స్ కూడా వేస్తున్నారు. తల పొగరు సెలబ్రేషన్స్ తరువాత ఆస్ట్రేలియా పూర్తిగా పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ప్రతి మ్యాచ్ లోను ఏ ప్లేయర్ కూడా అంతగా రాణించలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆస్ట్రేలియా జట్టు పై తీవ్రంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.
కరీంనగర్ మున్సిపల్ పోరులో బీజేపీ చారిత్రాత్మక రికార్డు..!
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు
