Homeతెలంగాణఓటుకు నోటు ఇవ్వొద్దు.. ఓటుకు నోటు తీసుకోవద్దు

ఓటుకు నోటు ఇవ్వొద్దు.. ఓటుకు నోటు తీసుకోవద్దు

•మోత్కుపల్లిని ఉదాహరణగా తీసుకోవాలి

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- ఓటుకు నోటు వ్యవస్థ మారాలని.. డబ్బులు ఇవ్వొద్దని,తీసుకోవద్దని ఈ వ్యవస్థను మార్చాలని అందుకొరకై అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆత్మకూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు సీనియర్ నాయకులు ప్రతికంఠం పూర్ణచందర్ రాజు పిలుపునిచ్చారు.ఈ వ్యవస్థ మారకుంటే గ్రామాలు,ప్రజలు దోపిడీకి గురి అవుతారని లంచగొండి తనం పెరిగిపోతుందని.. యువకులు నడుం బిగించి ముందుకురావాలని ఆయన కోరారు. మంచివారికి స్థానం లేకుండా పోయిందని ఇదేవిదంగా కొనసాగితే మంచికి స్థానం లేకుండా పోతుందని వాపోయారు. సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కొక్కరు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తారని.. ఓడిన వారు గెలిచిన వారు అప్పులపాలై ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. గతంలో మోత్కుపల్లి ‌నరసింహులు యంఎల్ఏ గా ఆరుసార్లు డబ్బులు, మద్యం, ఖర్చు లేకుండా ఎన్నికయ్యారని గుర్తుచేసారు. అందరం ఒకే ఉద్యమంగా తీసుకొని వ్యవస్థను మార్చాలని కోరారు.ఇప్పుడు జరిగే పుర ఎన్నికల్లో డబ్బులు పంచకుండా తీసుకోకుండా యువకులు ఉద్యమించాలని పూర్ణచందర్ రాజు కోరారు.

India Corruption: భారత్ లో తగ్గిన అవినీతి.. సంచలన విషయాలు వెల్లడించిన తాజా రిపోర్టు?

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments