
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా కోటి సంతకాల సేకరణ పూర్తి అయింది అని.. ప్రజలందరూ కూడా PPP విధానంపై విమర్శలు చేస్తున్నారు అని వైసిపి ఆరోపిస్తున్న సందర్భంలో తాజాగా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ విషయంపై స్పందిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిరోజు రప్ప రప్ప అంటూ విధ్వంసకర భాష మాట్లాడడమే కాకుండా ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతున్నారు అని వైసిపి పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజుకు ఎన్నో జంతువులను బలిచ్చారు. రక్తంతో రాసిన రాతలు తప్ప వారి ఘనత ఏమి లేదు అని జగన్మోహన్ రెడ్డి పై కూడా విమర్శించారు. మీరు చేపట్టినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ నిజమైతే వాటిని మేము కచ్చితంగా సమీక్షిస్తాం. కానీ రాష్ట్రంలో ఎవరినడిగినా కూడా ఎవరూ సంతకం పెట్టలేదు అని అంటున్నారు. మరి ఆ కోటి సంతకాలు ఏ ఆత్మలు పెట్టాయి.. లేక ప్రేతాత్మలు పెట్టాయా?.. అంటూ మంత్రి సత్య కుమార్ యాదవ్ వైసీపీ పార్టీని, ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కేంద్రం నిధులు పంపిస్తే వాటిని ఖర్చు చేయకుండా మీరు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. అలాంటివారు ఈ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి PPP విధానంపై విమర్శలు చేస్తున్నారా?.. అని నిలదీశారు.
Read also : “అఖండ-2” కలెక్షన్లు ఎంతో తెలుసా..?
read also : #Sarpanch: శివన్నగూడలో పాలనా దిశ మారుతోందా..?





