ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ జాతీయ మీడియాతో మాట్లాడారు.భారతదేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లు ఎందుకు అరెస్ట్ అయ్యారని అన్నారు.దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందని.. దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని చెప్పారు. ఒక మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు.. ఈ ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందని సీఎం రేవంత్ అన్నారు.
పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారని.. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అన్నారు.ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదని చెప్పారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేదని అన్నారు. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేయడంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారని.. పోలీసులకు కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదన్నారు.అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో A11గా పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులు.. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు.. అతనికి తాను తెలుసన్నారు.
అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత, అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత తనకు బంధువు.. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు .. హోం శాఖ నా వద్ద ఉంది, ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ నాకు తెలుసని రేవంత్ రెడ్డి చెప్పారు. చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడు.. సినిమా కోసం పైసలు పెట్టారు పైసలు సంపాదించారు.. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదంటూ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నా ఫేవరెట్ హీరో కృష్ణ.. ఆయన ఇప్పుడు లేరు.. ఇప్పుడు నేనే స్టార్.. నాకే ఫాన్స్ ఉంటారు.. ఉండాలి కూడా అన్నారు రేవంత్ రెడ్డి.