
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ జీవితాంతం కూటమిలో ఉన్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ జీవితాంతం కూటమిలో కలిసి ఉండాల్సిందిగా ఆయనను ఆశీర్వదిస్తున్న అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. మరోవైపు అసెంబ్లీ వేదికగా మీ అన్నయ్య చిరంజీవిను అవమానిస్తే.. కనీసం నోరు మెదపలేదు అని.. ఎందుకు మాట్లాడలేకపోయారు అని ప్రశ్నించారు. నిన్ను నమ్మి కాపులంతా కూడా చంద్రబాబుకు ఓటు వేస్తే ఇప్పుడు వారినే చంపుతున్నారు.. అయినా నోరు ఎందుకు ఎత్తలేదు?.. అని ప్రశ్నించారు. ఒక భుజంపై చంద్రబాబు నాయుడు మరో భుజంపై లోకేష్ ను ఎత్తుకొని జీవితాంతం కూటమిలోనే ఉండండి అని ఎద్దేవా చేశారు. ఎలక్షన్ల ముందు రాష్ట్రంలో అన్యాయం జరిగిన, అవమానం జరిగిన సహించేదే లేదు అనినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్న ఎందుకు వాటిపై మాట్లాడట్లేదు అని అంబటి రాంబాబు మీడియా వేదికగా నిలదీశారు. ఒకవేళ లోకేష్ నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టిన మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంబటి రాంబాబు వెల్లడించారు.
Read also : కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరని ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం!
Read also : పుష్ప రికార్డును బద్దలు కొట్టి సంచలనం సృష్టించిన పెద్ది వీడియో సాంగ్?





