Homeతెలంగాణ20 వ వార్డులో కాంగ్రెస్కు భారీ మెజార్టీ

20 వ వార్డులో కాంగ్రెస్కు భారీ మెజార్టీ

క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- శుక్రవారం వెలువడిన పురపాలిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా హస్తం జోరు కొనసాగింది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ డంకా మోగించారు. కల్వకుర్తి మున్సిపాలిటీ 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి 510 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. టిఆర్ఎస్ అభ్యర్థి ఎడ్మ మంజుల కు 206 ఓట్లు రాగా లలితకు 716 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో నిన్న వెలువడిన ఫలితాలు ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. ఈ సందర్భంగా లలిత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి చెయ్యి గుర్తుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలిపారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని చెప్పారు.

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కి కేటాయించాలి

శివరాత్రి రోజు మాంసం అమ్మకాలు నిషేధం : గ్రేటర్ బెంగళూరు అథారిటీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments