ఆందోళనలు..సీఎం దిష్టిబొమ్మదగ్దం
రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్ః హైదరాబాద్ కార్పొరేషన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని కలపడాన్నినిరసిస్తూ బీఆర్ ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభి ప్రాయం సేకరించకుండా ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఏక పక్ష నిర్ణయాలతో ప్రజలకు నష్టమొచ్చే పనులు చేస్తే మేము సహించమని తెలిపారు.
దీనిని నిరసిసస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టబొమ్మను దహనం చేశారు. అదే విధంగా ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.









